
Manchi Rojulochaie: ఓటీటీలోకి ‘మంచి రోజులు వచ్చాయి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇంటర్నెట్ డెస్క్: సంతోష్ శోభన్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం అతి త్వరలో డిజిటల్ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ ‘ఆహా’లో డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథేంటంటే: తిరుమలశెట్టి గోపాల్ (అజయ్ ఘోష్)కి తన కూతురు పద్మ (మెహరీన్) అంటే ప్రాణం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తన కూతురుపై ఎంతో నమ్మకం. కానీ, ఆమె తన సహోద్యోగి సంతోష్ (సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఎప్పుడూ సంతోషంగా కనిపించే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వారు ఆయనలో లేనిపోని భయాల్ని సృష్టిస్తారు. దాంతో గోపాల్ తన కూతురు విషయంలో ఆందోళన చెందుతుంటాడు. దానికితోడు కరోనా భయం తోడవుతుంది. ఇన్ని చిక్కుల మధ్య సంతోష్, పద్మల ప్రేమాయణం ఎలా సాగింది? గోపాల్ భయాల్ని ఈ జంట ఎలా దూరం చేసింది? అన్నది మిగతా కథ.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.