Manchu Lakshmi: మంచు లక్ష్మి, సుధీర్‌ల ‘హగ్‌’ వార్‌.. చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే!

‘హగ్‌’ కోసం మంచు లక్ష్మి, సుడిగాలి సుధీర్‌ మధ్య ఓ యుద్దమే జరిగింది. అసలు సుధీర్‌కి హగ్‌ తీసుకునే ఉద్దేశం లేకపోయినా తన పక్కనున్న వారి వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 27 Nov 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హగ్‌’ కోసం మంచు లక్ష్మి, సుడిగాలి సుధీర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు సుధీర్‌కి హగ్‌ తీసుకునే ఉద్దేశం లేకపోయినా అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎందుకు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అంటారా? ఇది చదివేయండి.. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో ‘ఢీ 13’ సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆ కార్యక్రమానికి నవంబరు 24న విచ్చేసి సందడి చేశారు. ‘ఇక్కడికి తొలిసారి వచ్చా. దీని గురించి నాకు క్లారిటీ ఇవ్వండి’ అని షో గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ‘ఇక్కడికి వచ్చిన అతిథులందరినీ హగ్‌ అడుగుతాడు మేడమ్‌’ అని కార్యక్రమ వ్యాఖ్యాత ప్రదీప్‌ సుధీర్‌ గురించి తెలిపాడు. ఇది విన్న సుధీర్‌ ‘మేడమ్‌.. నేను మిమ్మల్ని అడగలేదు’ అని అనగానే ‘ముందు నువ్వు నా దగ్గరికి రా చూద్దాం’ అని లక్ష్మి ఝలక్‌ ఇచ్చారు. ‘నువ్వు ఇంతకు ముందులా లేవు. ఏవేవో మనసులో పెట్టుకుట్టుని ఇక్కడికి వచ్చావ్‌’ అని సుధీర్‌పై ఫైర్‌ అయ్యారు. తనదైన శైలిలో కోప్పడి కడుపుబ్బా నవ్వించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మితోపాటు యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ (గుంటూర్‌ టాకీస్‌ ఫేం) విచ్చేశారు. ఆయనతో కలిసి ఆది, సుధీర్‌, రష్మి చేసిన ‘గుంటూర్‌ టాకీస్‌ 2’ స్కిట్‌ ఆకట్టుకుంది. ఈ బుధవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. మీరు అప్పుడు మిస్‌ అయి ఉంటే ఇప్పుడు ఇక్కడ చూసి ఆనందించండి..

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని