MAA Elections: కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు: మోహన్‌బాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అనేది కళాకారుల వేదికని.. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు...
ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అనేది కళాకారుల వేదికని.. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా తన తనయుడు మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమంటే సాధారణమైన విషయం కాదని.. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని విష్ణుకి సూచించారు. అంతేకాకుండా అసోసియేషన్‌లో ఉన్న అందరూ కలిసి కట్టుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
‘‘ఇది కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ‘మా’ ఎన్నికల సమయంలో మేము ఇంతమంది ఉన్నాం.. అంతమంది ఉన్నామని కొంతమంది వ్యక్తులు బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు. మా ఓటు మా ఇష్టమని నా బిడ్డను గెలిపించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. ఒకరి దయాదాక్షణ్యాలపై సినీ పరిశ్రమ ఉండలేదు. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగగలరు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. నాకు పగ, రాగద్వేషాలు లేవు. మనం కేవలం కళాకారుల గురించే మాట్లాడదాం. రాజకీయాల గురించి మాట్లాడవద్దు. ఎన్నికల్లో విజయాన్ని అందించిన మీరే నా బిడ్డకు దేవుళ్లు. ఇకపై, నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. కళాకారులందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయని వాళ్లపై పగ వద్దు. ఎందుకంటే పగ మనిషిని సర్వనాశనం చేస్తుంది. భారతదేశం గర్వించేలా ‘మా’ ఖ్యాతిని పెంచాలి. ‘మా’ సభ్యులకు ఇళ్ల నిర్మాణం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి మాట్లాడతాను. ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. అసోసియేషన్‌తో మీకు సంబంధం లేదు అనుకోకండి. ఇది మన అసోసియేషన్. నూతన కార్యవర్గానికి మీ సహాయసహకారాలు ఎంతో అవసరం. ‘మా’ అధ్యక్షుడు అనేది చిన్న ఉద్యోగం కాదు. అది ఒక పెద్ద బాధ్యత. ఎంతో మంది మహామహులు దీన్ని ఏర్పాటు చేశారు. కార్యవర్గంలోని సభ్యులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రెసిండెంట్తో చెప్పి సమస్యలను పరిష్కరించుకోండి. అంతేకానీ, టీవీలకు ఎక్కొద్దు. సినిమా పరిశ్రమ కోసం నేను ఎన్నో చేశాను. కానీ అందరూ అది మర్చిపోయారు. వాళ్లు గుర్తుపెట్టుకున్నా లేకున్నా.. నా కుటుంబానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నా తనయుడు విష్ణు గెలుపునకు నరేశ్ ఎంతో సాయం చేశారు. షూటింగ్స్ ఉన్నా సరే.. వాటన్నింటి నుంచి కొంత సమయం తీసుకుని మరీ నా కొడుకు కోసం పనిచేశాడు. నరేశ్‌ని ఎప్పటికీ మర్చిపోను’’ అని మోహన్‌బాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్