MAA Elections: ఈవీఎంలపై మాకు నమ్మకం లేదు: మంచు విష్ణు

ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖరాశారు. ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

Published : 05 Oct 2021 14:07 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త వివాదాలు, విమర్శలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ‘మా’ ఎన్నికల్లో బ్యాలెట్‌ వినియోగంపై ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎంలపై తమ ప్యానెల్‌ సభ్యులకు నమ్మకం లేదని, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

‘‘అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలి. ఈ విధానంలో జరిగే పోలింగ్‌లో పారదర్శకత ఉంటుంది. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనది. బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తే సీనియర్లు చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది’’అని మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని