
Manchu Vishnu: మహిళా భద్రతకు కమిటీ: మంచు విష్ణు
ఇంటర్నెట్ డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. ‘మా’లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్’ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారత కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. పద్మశ్రీ సునీతా కృష్ణన్ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని విష్ణు తెలిపారు. ‘మా’లో మరింత మంది మహిళలను భాగస్వాములను చేయడానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నట్లు విష్ణు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.