MAA Elections: ప్రచారం షురూ.. కృష్ణ మద్దతు కోరిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు ప్రచారం ప్రారంభించారు.

Updated : 01 Oct 2021 18:57 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు ప్రచారం ప్రారంభించారు. ఈ మేరకు తన తండ్రి, నటుడు మోహన్‌ బాబు, ప్యానెల్‌ సభ్యులతో ప్రముఖ నటుడు కృష్ణని కలిశారు. తమ అజెండా గురించి వివరించి, ప్యానెల్‌కి మద్దతివ్వాలని కృష్ణని కోరారు. అక్టోబరు 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని