Published : 23/11/2021 01:58 IST

The Family Man: ‘ఫ్యామిలీమ్యాన్‌’ను వద్దనుకున్న మనోజ్‌.. ఎన్నో అవకాశాలు తీసుకొచ్చిందన్న సమంత 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’.. వెబ్‌ సిరీస్‌ల్లో రారాజుగా నిలిచింది. ‘జేమ్స్‌బాండ్‌’ చిత్రాలంతటి క్రేజ్‌ సంపాదించుకుంది. రెండు సీజన్లలో విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌, టాలీవుడ్‌ నటి సమంతకు విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు ముందుగా మనోజ్‌ బాజ్‌పాయ్‌ సంశయించారట. ఎందుకలా అనుకున్నారో ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) చర్చా వేదికలో తెలిపారు. మనోజ్‌తోపాటు సమంత, సిరీస్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే పాల్గొన్నారు.

ఆ విషయంలో స్పష్టత ఉంది

వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వరుసగా ఆఫర్ల వస్తున్న సమయంలోనే ‘ఫ్యామిలీమ్యాన్‌’ కథ నా దగ్గరకు వచ్చింది. వాటిల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నా కాస్త భయపడేవాడ్ని. ఎందుకంటే అవి సిరీస్‌లకు సరిపోయే విధంగా ఉంటాయో లేదోనని! ఎలాంటి ప్రాజెక్టుల్లో నటించకూడదు అనే విషయంలో స్పష్టత ఉంది. కానీ, ఎలాంటి వాటిల్లో నటించాలి అనే విషయంలో క్లారిటీ లేదు. అలా ‘ఫ్యామిలీమ్యాన్‌’కు నో చెప్పాలనుకున్నా. అదే సమయంలో.. కొన్ని వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించడాన్ని చూశా. థ్రిల్లింగ్‌ అంశాలు దానికి కారణమని తెలుసుకున్నా. ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వాలనుకునే ఉద్దేశంతో ఈ సిరీస్‌ను ఓకే చేశా.

వారి ప్రభావం ఉండదు

మనమంతా సినిమాలు చూస్తూనే పెరిగాం. ఈ క్రమంలో చాలామంది నటనకు ప్రభావితమవుతుంటాం. నా విషయానికొస్తే.. అమితాబ్‌ బచ్చన్‌, నజీరుద్దీన్‌ షా, ఓం పురి, రాబర్ట్‌ డి నిరోను అభిమానిస్తా. అయితే నటుడిగా వారి ప్రభావం నాపై ఉండదు. వారి ఛాయలు నేను పోషించే పాత్రలో కనిపించాలనే ప్రయత్నం చేయను. నా స్వీయ అనుభవమే ద్వారానే ఆయా పాత్రలకు జీవం పోస్తుంటా. నాటకాలు, సినిమాలు, సిరీస్‌లు.. ఇలా వేదిక ఏదైనా ప్రతీ నటుడు తనదైన ముద్ర వేయాలనుకుంటాడు. ఆ మార్గంలోనే నేనూ ప్రయాణిస్తున్నాననుకుంటున్నా. అలా నటించినవే ‘ఫ్యామిలీమ్యాన్‌’లోని శ్రీకాంత్‌ తివారీ, ‘షూల్‌’లోని సమర్‌ ప్రతాప్‌, ‘సత్య’లోని భికు మహత్రే తదితర పాత్రలు.

ఆ ప్రశ్నకు సమాధానమిది

‘శ్రీకాంత్‌ తివారీ పాత్రలో ఒదిగిపోయారు కదా. దానికి స్ఫూర్తి ఎవరు?’.. ‘ఫ్యామిలీమ్యాన్‌’ విషయంలో నన్ను చాలామంది అడిగే ప్రశ్న ఇది. శ్రీకాంత్‌ తివారీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పాత్ర. మాదీ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీనే. అందువల్ల ఈ పాత్ర కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. మా నాన్న, అన్నయ్య, మా ఇరుగుపొరుగు వ్యక్తులు అందరి జీవన విధానం ఒకేలా ఉంటుంది. వారిని గమినిస్తూ నన్ను నేను తెలుసుకున్నా. నాలోనే శ్రీకాంత్‌ తివారీని వెతుక్కున్నా. నాలోనే కాదు మీలోనూ శ్రీకాంత్‌ ఉన్నాడు. కష్టపడి కుటుంబాన్ని నడిపించే మధ్యతరగతి వాళ్లందరూ శ్రీకాంత్‌ తివారీలే.

రిస్క్‌ చేస్తేనే: సమంత

‘ఓ నటిగా నా పరిధుల్ని దాటేందుకు ఇష్టపడతా. రిస్క్‌ చేసేందుకు ఎప్పుడూ ముందుంటా. ఆ ఆలోచనతోనే ‘ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’లో రాజి అనే పాత్రలో నటించా. ఇది నాకెంతో గుర్తింపునిచ్చింది. నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఎన్నో అవకాశాల్ని తీసుకొచ్చింది’ అని సమంత తెలిపారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్