Published : 25/11/2021 21:55 IST

Marakkar: రూ.100 కోట్ల బడ్జెట్‌ చిత్రం.. అంచనాలు పెంచుతున్న ‘మరక్కార్‌’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మరక్కార్‌’. అరేబియా సముద్ర సింహం.. ఉపశీర్షిక. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌, సునీల్‌ శెట్టి, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో టీజర్‌ని విడుదల చేసింది. అబ్బురపరిచే సెట్లు, యాక్షన్‌ సన్నివేశాలతో తీర్చిదిద్దిన ఈ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. నేపథ్య సంగీతం ప్రధానబలంగా నిలిచింది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్‌ నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: రొన్నీ రాఫెల్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.తిరునావుక్కరసు.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని