అక్షయ్‌...వాణీ ఓ ప్రణయ గీతం

అక్షయ్‌కుమార్, వాణీ కపూర్‌ ప్రేమ పక్షుల్లా విదేశీ లోకేషన్లలో ప్రణయ గీతం పాడుకున్న తీరు చూసి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రంలోని రొమాంటిక్‌ గీతం...

Published : 07 Aug 2021 09:05 IST

అక్షయ్‌కుమార్, వాణీ కపూర్‌ ప్రేమ పక్షుల్లా విదేశీ లోకేషన్లలో ప్రణయ గీతం పాడుకున్న తీరు చూసి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘బెల్‌బాటమ్‌’ చిత్రంలోని రొమాంటిక్‌ గీతం ‘మర్జావాన్‌’ వీడియో గీతం శుక్రవారం విడుదలైంది. అలరించే సంగీతంతో అందమైన విదేశీ లోకేషన్లలో తెరకెక్కించిన ఈ గీతంలో అక్షయ్, వాణీ జంట ఆకట్టుకుంటోంది. ఈ పాటను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు అక్షయ్‌. ‘‘బెల్‌బాటమ్‌’లో నాకు ఎంతో ఇష్టమైన పాట ‘మర్జావాన్‌’. చిత్రీకరణ జరిగినన్ని రోజులు ఈ పాట స్వరం నా బుర్రలో బంధీ అయిపోయింది’’అని ట్వీటారు అక్షయ్‌. ఈ సినిమా ఈ నెల 19 థియేటర్లలో విడుదల కానుంది. దీని గురించి అక్షయ్‌ మాట్లాడుతూ ‘‘అందరిలోనూ ఒత్తిడి ఉంది. కానీ అంతా మంచి జరుగుతుందనే నమ్ముతున్నాం. ఇదో సవాల్, సాహసమే. ఆ మాత్రం రిస్క్‌ తీసుకోకపోతే జీవితంలో మనం చేసేది ఇంకేముంటుంది?’’ అని చెప్పారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts