Chiranjeevi: చిరు కుటుంబంలో పెద్ద పండుగ.. వీడియోలు వైరల్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్‌ బిజీ బిజీగా ఉంటున్నారు. దీంతో కుటుంబంలో జరిగే కొన్ని ఫంక్షన్లకు ఆయన సరిగ్గా సమయాన్ని...

Updated : 08 Dec 2022 13:19 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. దీంతో కుటుంబంలో జరిగే కొన్ని ఫంక్షన్లకు ఆయన సరిగ్గా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. మెగా ఇంట వేడుకల్లో పవన్‌ కనిపించకపోవడం పట్ల అభిమానులు కూడా పలు సందర్భాల్లో నిరాశ చెందారు. వాళ్ల ఎదురుచూపులు, నిరాశకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ కొణిదెల కుటుంబంలో ఓ పెద్ద పండుగ జరిగింది. అదే మెగాస్టార్‌ చిరంజీవి 66వ పుట్టినరోజు. ఆదివారం జరిగిన ఈ వేడుకల్లో పవర్‌స్టార్‌ ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పవన్‌ రాకతో అటు కుటుంబసభ్యులతోపాటు ఇటు అభిమానులు కూడా ఎంతో సంతోషించారు. పవన్‌ని చూడగానే చిరు ఆలింగనం చేసుకుని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. అనంతరం వదినమ్మను చూసి.. ‘ఏంటండి సురేఖ గారు. ఎలా ఉన్నారు?’ అంటూ పవన్‌ ఆటపట్టించారు. ఇలా చెప్పుకొంటూ వెళితే ప్రతి ఫ్రేమ్‌ అభిమానులను ఫిదా చేసేలా ఉంది. దీంతో ఈ వీడియోలు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి. చిరంజీవి బర్త్‌డే వీడియోలపై మీరు ఓ లుక్కేయండి..!






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని