Chiranjeevi: అదే నాకున్న బలమైన బలహీనత: చిరంజీవి

సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్తవాళ్లు ఏమాత్రం వైవిధ్యంగా చేసినా.. దాన్ని చూసి మురిసిపోవడం, వాళ్లని ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత.....

Updated : 12 Nov 2021 13:46 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్తవాళ్లు ఏమాత్రం వైవిధ్యంగా చేసినా.. దాన్ని చూసి మురిసిపోవడం, వాళ్లని ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రానికి చిరు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ చిత్రాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరుకున్నారు.

 ‘‘ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగిన వాళ్లంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే, సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో నేను కూడా ఎదిగింది.. ఆ స్వయంకృషి అనే తారకమంత్రంతోనే. ప్రస్తుతం స్వయంకృషితో కెరీర్‌లో ఎదుగుతున్న యంగ్‌ హీరో కార్తికేయ. నా అభిమాని. నాక్కూడా అతని పట్ల ఓ సోదరభావం ఉంది. నాకు చాలా ఇష్టమైన నా సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్‌తో ఇప్పుడు అతను ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేశారు. ఆ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చూశాను. చాలా బాగున్నాయి. యువతరం ఏమాత్రం కొత్తగా, ఏమాత్రం వైవిధ్యంగా చేసినా ముచ్చటపడిపోవడం, మురిసిపోవడం, ప్రోత్సహించడం నాకున్న బలమైన బలహీనత. కార్తికేయ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చిరు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోని కార్తికేయ ట్వీట్‌ చేస్తూ.. ఇకపై తాను మరింత కష్టపడి మంచి సినిమాలు చేస్తానని అన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని