Chiranjeevi: వీరాభిమానికి అనారోగ్యం.. చిరు తక్షణ ఆర్థిక సాయం

తనని ఎంతగానో ఆరాధించే అభిమానులకు అపన్నహస్తం అందించడానికి మన సినీ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసి తమలోని...

Published : 27 Oct 2021 11:25 IST

హైదరాబాద్‌: తనని ఎంతగానో ఆరాధించే అభిమానులకు అపన్నహస్తం అందించడానికి మన సినీ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి అభిమానికి సాయం చేసి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న అభిమానికి తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందించారు.

విశాఖపట్నంకు చెందిన వెంకట్‌ అనే వ్యక్తికి మెగాస్టార్‌ చిరంజీవి అంటే వీరాభిమానం. ఆయనకు క్యాన్సర్‌ ఉన్నట్లు ఇటీవల వైద్యులు గుర్తించారు. చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో నిరాశకు లోనైన వెంకట్‌ ట్విటర్‌ వేదికగా.. తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ.. చిరుని కలవాలనుకుంటున్నానని ఓ ట్వీట్‌ చేశాడు. ఇటీవల ఆ ట్వీట్‌ చూసిన చిరు స్పందించారు. వెంకట్‌ దంపతులను హైదరాబాద్‌కు పిలిపించారు. వెంకట్‌ ఆరోగ్యంపై క్షుణ్ణంగా చర్చించారు. వైద్య ఖర్చులన్నీ తానే పూర్తిగా భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తక్షణ ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని