Published : 13/08/2021 22:57 IST

Raja Raja Chora: అందుకే తెలుగు చిత్రాలకు దూరమయ్యాను

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, ‘ఛల్‌ మోహన్‌ రంగ’తో అందరినీ తనవైపు తిప్పుకుంది మేఘా ఆకాశ్‌. తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయిన ఆమె టాలీవుడ్‌లో మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమైంది. శ్రీ విష్ణు సరసన మేఘ నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్‌ గోలి దర్శకుడు. ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడింది మేఘ. ఆ సంగతులివీ...

* కొన్నాళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎందుకలా?

మేఘ: కావాలని తీసుకున్న విరామం కాదది. నేను భాషని బట్టి సినిమాలు ఒప్పుకోను. కథ నచ్చితే ఏ భాషలోనైనా నటిస్తా. నా దగ్గరికి వచ్చిన కొన్ని తమిళ కథలు ఆసక్తిగా ఉండటంతో వాటితో బిజీ అయిపోయా. అలా టాలీవుడ్‌కి కాస్త దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ ఇక్కడ బిజీ అయ్యాను. కెరీర్‌ ప్రారంభంలో నాకు సరిపోయే కథల్ని ఎంపిక చేసుకునేదాన్ని. ప్రస్తుతం నా ఆలోచనా విధానం మారింది. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకి వచ్చేందుకు విభిన్న కథల్ని వింటున్నా.

* ఈ చిత్రాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?

మేఘ: నా పాత్రే కాదు సినిమాలోని అన్ని పాత్రలూ చాలా సహజంగా ఉంటాయి.  వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ కావడంతో నాకు బాగా నచ్చింది. గతంలో నేను పోషించిన పాత్రలకు, ఈ సినిమాలోని పాత్రకు సంబంధం ఉండదు. ఈ సినిమాలో నన్ను కొత్తగా చూడొచ్చు.

* కథానాయకుడు శ్రీ విష్ణు గురించి చెప్తారా?

మేఘ: నాలాగే శ్రీ విష్ణుకు కూడా చాలా సిగ్గు. తొలిసారి నాకంటే ఎక్కువ సిగ్గుపడే వ్యక్తిని చూశాను. ఇద్దరం అలానే ఉండేసరికి నాలో కొంచెం ధైర్యం వచ్చింది. కొన్ని రోజులు అతడ్ని పరిశీలించి, తర్వాత నేనే అతనితో మాట్లాడటం ప్రారంభించా.

* టీజర్‌లో శ్రీ విష్ణు పాత్ర ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. మీ పాత్ర ఎలా ఉంటుంది?

మేఘ: నేను ఇందులో సంజన అనే పాత్ర పోషించాను. చాలా సరదాగా ఉంటుందా పాత్ర. శ్రీ విష్ణు, సంజన పాత్రలే కాదు ఈ సినిమాలోని అన్ని పాత్రలు కామెడీ పండిస్తాయి.

* మీరు బాగా ఎంజాయ్‌ చేసిన సన్నివేశం?

మేఘ: దేవాలయంలో నాకూ శ్రీవిష్ణుకి మధ్య ఓ సన్నివేశం ఉంటుంది. ఎందుకో చెప్పలేను కానీ అది షూట్‌ చేసేటపుడు బాగా ఎంజాయ్‌ చేశా. ఈ సీన్‌లో శ్రీ విష్ణు హావభావాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయా.

* ‘రాజ రాజ చోర’ సినిమాలో ఏం ఆశించవచ్చు?

మేఘ: ఈ సినిమా తప్పకుండా వినోదాన్ని పంచుతుంది. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వుని తీసుకొస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఫన్‌ ఎంతో అవసరం.

* తదుపరి చిత్రాలేంటి?

మేఘ: తెలుగులో ప్రస్తుతం ‘డియర్‌ మేఘ’లో నటిస్తున్నా. ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్నా. ‘మను చరిత్ర’ అనే మరో చిత్రం చేస్తున్నా. 

* తెలుగు నేర్చుకున్నారా?

మేఘ: నాకు తెలుగు అర్థమవుతుంది. కానీ, మాట్లాడటం అంతగా రాలేదు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని