Liger: ‘లైగర్‌’ బిగ్‌ అప్‌డేట్‌.. విజయ్‌ దేవరకొండతో మైక్‌ టైసన్‌

బాక్సింగ్‌ అనగానే గుర్తొచ్చే పేరు మైక్‌ టైసన్‌. బాక్సింగ్‌ అంటే మైక్‌ టైసన్‌. టైసన్‌ అంటే బాక్సింగ్‌ అని చెప్పుకునేంతలా తనని తాను నిరూపించుకున్నాడు.

Published : 27 Sep 2021 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సింగ్‌ అంటే మైక్‌ టైసన్‌. టైసన్‌ అంటే బాక్సింగ్‌ అని చెప్పుకునేంతలా తనని తాను నిరూపించుకున్నాడు. అలాంటి టైసన్‌ వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ పండగలాంటి వాతావరణాన్నే దర్శకుడు పూరి జగన్నాథ్ చూపించనున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి టైసన్‌ని నటుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లైగర్‌’. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఇందులో మైక్‌ టైసన్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విష్ణురెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని