Sirivennela: సిరివెన్నెల పాటలు చాలా మందికి కనువిప్పు: తలసాని

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణించటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమైన రోజని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ..

Updated : 01 Dec 2021 11:36 IST

హైదరాబాద్‌: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణించటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమైన రోజని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఉంచిన సిరివెన్నెల పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘800 సినిమాల్లో 3వేలకు పైగా పాటలు రాసిన మహానుభావుడు సిరివెన్నెల. ఆయన రాసిన ప్రతి పాటా అందరికీ సులభంగా అర్థమయ్యేది. ఆయన పాటలన్నీ పండగల్లా ఉంటాయి. సిరివెన్నెల పాటలు చాలా మందికి కనువిప్పు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడున్న రచయితలు సిరివెన్నెల పాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని తలసాని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని