ఫిల్మ్‌హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి తలసాని

హైదరాబాద్‌ని ఫిల్మ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది.

Published : 10 Aug 2021 19:14 IST

హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ని ఫిల్మ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన సినీ ప్రదర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఐదో ఆటకు అనుమతి తదితర అంశాలపై చర్చించారు. ‘హైదరాబాద్‌ని ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సినిమా షూటింగ్‌లకు ఇబ్బంది లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నాం’ అని తెలిపారు. థియేటర్లకి సంబంధించిన (లాక్‌డౌన్‌ సమయంలో) నామమాత్రపు విద్యుత్తు ఛార్జీలు, ఆస్తిపన్ను మినహాయింపు తదితర విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఐదో ఆట ప్రదర్శన గురించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని