Missing: అబద్ధంతో మొదలుపెట్టి...

‘కథ ఎక్కడ మొదలైందో... అక్కడే ముగుస్తుంది. ఇదొక విజయవంతమైన స్క్రీన్‌ప్లే ఫార్ములాతో తెరకెక్కిన చిత్రం’’ అన్నారు శ్రీని జోస్యుల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్‌’. హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా

Updated : 19 Nov 2021 07:32 IST

‘‘థ ఎక్కడ మొదలైందో... అక్కడే ముగుస్తుంది. ఇదొక విజయవంతమైన స్క్రీన్‌ప్లే ఫార్ములాతో తెరకెక్కిన చిత్రం’’ అన్నారు శ్రీని జోస్యుల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్సింగ్‌’. హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్‌ ప్రధాన పాత్రధారులు. భాస్కర్‌ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మాతలు. చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘నన్ను నేను నిరూపించుకోవడానికి ముందు పరిమిత వ్యయంతో కూడిన ఓ సినిమా చేయాలనుకున్నా. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథ రాసుకుని ‘మిస్సింగ్‌’ మొదలుపెట్టా. అబద్ధంతో మొదలయ్యే ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. ముందస్తుగా కొద్దిమందికి సినిమా చూపించాం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మా సినిమా కోసం బన్నీ వాస్‌ థియేటర్ల పరంగా సాయం చేశారు. నైజాంలో ఏషియన్‌ సినిమాస్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమాలో విషయం ఉంటే కచ్చితంగా అండ దొరుకుతుంది. తదుపరి ప్రేమకథతో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘థియేటర్‌ అనుభూతి కోసం చేసిన ఇది. థ్రిల్లింగ్‌ అంశాలు, మలుపులు ఆకట్టుకుంటాయ’’న్నారు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కిరణ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని