‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో మలయాళీ నటుడు

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె. ప్రస్తుతం 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 04 Aug 2021 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్‌.ఆర్‌.ఎస్‌.జె. ప్రస్తుతం 'మిషన్‌ ఇంపాజిబుల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం మలయాళీ నటుడు హరీశ్‌ని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ప్రదర్శించగల నటుడిగా హరీశ్‌కి పేరుంది. ఆయన ఎక్కువగా మలయాళం, తమిళం చిత్రాల్లో నటించారు. ‘గ్యాంగ్‌స్టర్‌’, ‘పులిమురుగన్‌’, ‘మెర్సల్‌’, ‘ఖైదీ’, ‘సుల్తాన్‌’ తదితర సినిమాలతో మెప్పించారు. మహేశ్‌ బాబు కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారాయన. తొలిసారి నేరుగా తెలుగు చిత్రంలో నటించబోతున్నారు.  ఈ సినిమాలో నాయిక తాప్సీ ముఖ్య పాత్రలో నటిస్తోంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దీపక్‌ యరగర, సంగీతం: మార్క్‌ కె.రాబిన్‌, కూర్పు: రవితేజ గిరిజల, కళ: నాగేంద్ర.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని