MAA Elections: అప్పుడు ‘మా’ భవనాన్ని ఎందుకు అమ్మేశారు? 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ‘మా’ క్రమశిక్షణ సంఘం..

Updated : 27 Aug 2021 21:11 IST

‘మా’ సమావేశంలో మోహన్‌బాబు ప్రశ్నల వర్షం

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా పరిస్థితుల రీత్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

‘మా’ కోసం గతంలో ఓ భవనం కొని అమ్మేశారని మోహన్‌బాబు గుర్తుచేశారు. అధిక మొత్తంతో భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. అసోసియేషన్‌ భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా? అని నిలదీశారు. అసోసియేషన్‌ భవనం విషయం తనని ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని