Mohanlal: ‘బ్రోడాడీ’.. ప్రారంభమైంది

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రోడాడీ’. పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ సెట్‌కి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

Published : 15 Jul 2021 22:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రోడాడీ’. పృథ్వీరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేస్తూ సెట్‌కి సంబంధించిన వీడియోను పంచుకున్నారు మోహన్‌లాల్‌. ఇందులో షూటింగ్‌ ప్రారంభానికి ముందు నిర్వహించిన పూజా కార్యక్రమం, నటీనటులు కనిపించారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శిని, పృథ్వీ రాజ్‌, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఎన్నో చిత్రాల్లో తన నటనతో మెప్పించిన పృథ్వీరాజ్‌ ‘లూసిఫర్‌’ చిత్రంతో దర్శకుడిగా మారారు. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం అందుకుంది. చిరంజీవి హీరోగా ‘లూసిఫర్‌’ తెలుగులో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని