Akhil - Pooja: అఖిల్, పూజ సందడి.. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ట్రైలర్‌ చూశారా!

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ట్రైలర్ చూశారా.. అఖిల్‌, పూజా హెగ్డే నటించిన చిత్రమిది..

Updated : 30 Sep 2021 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని అఖిల్ అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. అఖిల్‌ హీరోగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ ట్రైలర్‌ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. కొవిడ్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్‌, కామెడీ తదితర అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అఖిల్‌, పూజా హెగ్డే జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని ఎదురుచూస్తుంటుంది పూజా. ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్‌, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి’ అనేది అఖిల్‌ అభిప్రాయం. ఇలా ఇద్దరూ చెప్పే పెళ్లి ముచ్చట్లు విశేషంగా అలరిస్తున్నాయి. ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరి మధ్య విబేధాలు  తలెత్తుతాయి.

‘నీకు పెళ్లి గురించి ఏం తెలియదు. అసలు నీకు గురించి నీకే తెలియదు’ అని అఖిల్‌ని ఉద్దేశించి పూజ విమర్శిస్తుంది. ఆ కోపంతో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను’ అని అఖిల్‌ చెప్పిన తీరు మెప్పిస్తోంది. ‘లోకం సర్దుకుపొమ్మంటుంది, మందని వదలి.. కొత్తదారి వెతికి. నేను వెళ్తున్నా, మీరూ రండి’ అనే సంభాషణతో ట్రైలర్‌ ముగుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని