Akhil - Pooja: అఖిల్, పూజ సందడి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూశారా!
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూశారా.. అఖిల్, పూజా హెగ్డే నటించిన చిత్రమిది..
ఇంటర్నెట్ డెస్క్: అక్కినేని అఖిల్ అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. కొవిడ్ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్, కామెడీ తదితర అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అఖిల్, పూజా హెగ్డే జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘మన లైఫ్ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని ఎదురుచూస్తుంటుంది పూజా. ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలి’ అనేది అఖిల్ అభిప్రాయం. ఇలా ఇద్దరూ చెప్పే పెళ్లి ముచ్చట్లు విశేషంగా అలరిస్తున్నాయి. ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తుతాయి.
‘నీకు పెళ్లి గురించి ఏం తెలియదు. అసలు నీకు గురించి నీకే తెలియదు’ అని అఖిల్‌ని ఉద్దేశించి పూజ విమర్శిస్తుంది. ఆ కోపంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను’ అని అఖిల్ చెప్పిన తీరు మెప్పిస్తోంది. ‘లోకం సర్దుకుపొమ్మంటుంది, మందని వదలి.. కొత్తదారి వెతికి. నేను వెళ్తున్నా, మీరూ రండి’ అనే సంభాషణతో ట్రైలర్ ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
రజనీ చిత్రంలో నాగ్?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమా ఇది. సోమవారం పేరుని ప్రకటిస్తున్నారు. ‘తంగమ్’, ‘రాణా’ తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.