IMDB: 2021 మోస్ట్‌ పాపులర్‌ చిత్రాలివే.. ‘జై భీమ్‌’ ఏ స్థానంలో ఉందంటే..!

2021.. చిత్రపరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించింది. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు థియేటర్లు మూతపడి ఉండటంతో దక్షిణాది, బాలీవుడ్‌ సినిమాలు కొంతవరకూ ఓటీటీల్లోనే విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.

Published : 10 Dec 2021 01:43 IST

ముంబయి: 2021.. చిత్రపరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించింది. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు థియేటర్లు మూతపడి ఉండటంతో దక్షిణాది, బాలీవుడ్‌ సినిమాలు కొంతవరకూ ఓటీటీల్లోనే విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో అలరించాయి. కాగా, మరికొన్నిరోజుల్లో ఈ ఏడాది ముగియనుండటంతో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ 2021 మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సినిమాల జాబితాని గురువారం విడుదల చేసింది. ఐఎండీబీ యూజర్స్‌ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ జాబితాలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్‌’ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. మరి, జాబితాలో ఉన్న టాప్‌ 10 సినిమాలేమిటంటే..!

1.జై భీమ్‌ (సూర్య - కోలీవుడ్‌‌)

2. షేర్‌ షా(సిద్దార్థ్‌ మల్హోత్ర - బాలీవుడ్‌)

3. సూర్యవన్షీ (అక్షయ్‌కుమార్‌ - బాలీవుడ్‌) 

4.మాస్టర్‌ (విజయ్‌ - కోలీవుడ్‌) 

5.సర్దార్‌ ఉద్దమ్‌ (విక్కీ కౌశల్‌ - బాలీవుడ్‌‌)

6.మీమీ (కృతిసనన్‌ - బాలీవుడ్‌)

7.కర్ణన్ (ధనుష్‌ - కోలీవుడ్‌‌‌)

8.షిద్దత్‌ (సన్నీకౌశల్‌ - బాలీవుడ్‌)

9.దృశ్యం-2 (మోహన్‌లాల్‌ - మలయాళం)

10.హసీనా దిల్‌రూబా (తాప్సీ - బాలీవుడ్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని