Cinema news: టైటిల్‌కి ‘రంగే’శారు..!
రంగుల పేర్లతో వెండితెరపై పలు చిత్రాలు అలరించాయి. వాటిలో కొన్ని మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్: ‘కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ చెప్పినట్టు ‘కాదేదీ టైటిల్‌కి అనర్హం’ అని అంటుంటారు దర్శక-నిర్మాతలు. అలా మనుషుల పేర్ల నుంచి ఊరి పేర్ల వరకు, ముద్దు పేర్ల నుంచి ప్రముఖుల పేర్ల వరకు, నంబర్ల నుంచి రంగుల వరకు అన్నింటినీ సినిమా టైటిల్‌గా పెడుతున్నారు. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. అయితే చాలా తక్కువ సినిమాలకు రంగుల పేర్లు పెట్టారు. మరి ఆ సినిమాలేంటి? ఆ రంగులేంటి? చూద్దామా..!
విభిన్న ప్రేమకథ.. ‘ఆరెంజ్’
ఇప్పటి వరకూ వెండితెరపైకి వచ్చిన ప్రేమ కథల్లో ‘ఆరెంజ్’ ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పే రామ్ అనే ప్రేమికుడి కథ ఇది. రామ్‌చరణ్, జెనీలియా జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ప్రభు కీలక పాత్రలు పోషించారు. మ్యూజికల్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. ఇందులోని ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అంతగా తన సంగీతంతో మాయ చేశారు హ్యారీస్ జయరాజ్. ‘ఆరెంజ్’ పండుని చూసినా, ఆ పేరుని విన్నా ఈ ప్రేమకథే గుర్తుకొస్తుంది.
న్యాయం కోసం.. ‘పింక్’
తాము చేయని నేరంలో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిలకి న్యాయం చేసే ఓ లాయర్ కథే ‘పింక్’. అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కుల్హరి, ఆండ్రియా తదిరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ధరాయ్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్‌సాబ్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ‘నేర్కొండ పార్వైయ్’గా రీమేక్ అయింది. కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఈ కథ విశేషంగా మెప్పించింది. చాలామందిని ఆలోచింపజేసింది.
యాక్షన్ థ్రిల్లర్.. ‘రెడ్’
రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించారు. నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నాయికలు. ఓ వ్యక్తి చేసిన నేరానికి అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి ఎదుర్కొనే సమస్యని ఈ సినిమాలో చూపించారు. తమిళ చిత్రం ‘తడమ్’ రీమేక్‌గా రూపొందించారు. ఈ కథ తమిళ, తెలుగు ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంది. ‘రెడ్’ అంటే రామ్.. రామ్ అంటే ‘రెడ్’ అనేంతగా ప్రాచుర్యం పొందింది.
క్రైమ్, సస్పెన్స్.. ‘బ్లాక్’
ఆది కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్లాక్’. జి.బి. కృష్ణ దర్శకుడు. దర్శనా బానిక్ కథానాయిక. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో ఆది పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఆమని, సూర్య, కౌశల్, పృథ్వీరాజ్, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
-
India News
Indian Railway: ఆర్పీఎఫ్లో 20 వేల ఉద్యోగాలు.. రైల్వేశాఖ క్లారిటీ
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/04/2023)