
Muddy: ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ ‘మడ్డీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంటర్నెట్‌డెస్క్: యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మడ్డీ’. ప్రగభల్ దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విభిన్న చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబరు 31వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ప్రధాన నటులు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.