Updated : 11/11/2021 07:32 IST

NBK107: ముహూర్తం కుదిరింది

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13న చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ‘అఖండ’ పనులన్నీ పూర్తయ్యాక చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ‘‘బాలకృష్ణ 107వ చిత్రమిది. ఆయన మార్క్‌ మాస్‌ మసాలా అంశాలతో రూపొందనుంది. ‘క్రాక్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న గోపీచంద్‌ మలినేని పూర్తిస్థాయి వాణిజ్యాంశాలతో స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని