Thaman: ప్రభాస్‌ ప్రేమకథా చిత్రం.. రంగంలోకి దిగిన తమన్‌

తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాలే కాకుండా ఇతర ప్రాజెక్టులకూ తమన్‌ నేపథ్య సంగీతం అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Published : 26 Dec 2021 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను సంగీత దర్శకత్వం వహించే సినిమాలే కాకుండా ఇతర ప్రాజెక్టులకూ నేపథ్య సంగీతం అందించి తమన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బీజీఎమ్‌’ (బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌)తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లొచ్చని నిరూపించారు. ఈ క్రమంలో ఇప్పుడాయన.. ప్రభాస్‌ నటించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ బీజీఎమ్‌ కోసం రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్‌ తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌కు తమన్‌ బీజీఎమ్‌ అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ (దక్షిణాది భాషలు), మిథున్‌- అమాల్‌ మాలిక్‌ (హిందీ వెర్షన్‌) సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన గీతాలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది.

1970ల కాలంనాటి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే సందడి చేయనుంది. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకానుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని