Akhanda: ‘అఖండ’.. మునుపెన్నడూ చూడని కథ: తమన్
సంగీత దర్శకుడు తమన్ ఇంటర్వ్యూ. బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ గురించి తమన్ పంచుకున్న విశేషాలివీ...
ఇంటర్నెట్ డెస్క్: ‘‘అఖండ’ సినిమాకు సంగీతం అందించేందుకు రీసెర్చ్ చేశా. ఇలాంటి కథ ఇంతకుమందెన్నడూ రాలేదు’’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా తమన్ మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇలాంటి కథ చూసుండరు..
ఈ సినిమా కోసం చాలా శ్రమించా. ఇందులోని అఘోరా పాత్రకు నేపథ్య సంగీతం అందించేందుకు రీసెర్చ్ చేశా. అనుకున్నట్టుగానే సంగీతం అద్భుతంగా వచ్చింది. టైటిల్ సాంగ్ బాగుందని బాలకృష్ణ ప్రశంసించారు. నా కెరీర్లో ఈ సినిమాకి ది బెస్ట్ వర్క్ చేశానని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ.. ఈ ఇద్దరితో విడివిడిగా పనిచేస్తేనే ఏదో తెలియని హుషారు వస్తుంది. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్లో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది. ‘అఖండ’ కథ ‘నెవర్ బిఫోర్.. నెవర్ అగైన్’ అనిపిస్తుంది. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ నటనలో విజృంభించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను మధ్య మంచి అనుబంధం ఉంది. వారి కాంబినేషన్లో ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్టే! ఈ సినిమా చూస్తే అఘోరాలపై స్పష్టత వస్తుంది. వారెందుకు అలా ఉంటారో అర్థమవుతుంది.
దాని గురించి ఆలోచించను..
ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. నా విషయానికొస్తే.. సుమారు 120 మంది గాయకులతో చాలా ప్రయోగాలు చేశా. సినిమాకు ఏం కావాలో అదే ఇచ్చాను. ఏ పాటకు ఏ సింగర్ న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకున్నా. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమాకూ అలానే చేస్తుంటా. రెమ్యునరేషన్ గురించి ఆలోచించి ఒకరు పాడాల్సిన పాటని మరొకరితో పాడించను. శంకర్ మహదేవన్ శివుడి గురించి ఎన్నో పాటలు పాడారు. ఆయన స్వరమైతేనే బాగుంటుందని టైటిల్ గీతాన్ని పాడించాం. ఈ పాటను కంపోజ్ చేసేందుకు సుమారు నెల సమయం పట్టింది. సినిమాలో ఓ గొప్ప సన్నివేశం పూర్తయిన వెంటనే ఆ పాట వస్తుంది.
ఉత్సాహమిచ్చారు..
దర్శకుడు కథ చెప్పినప్పుడే నాకు ఉత్సాహం కలిగింది. బాలకృష్ణతోపాటు జగపతిబాబు, శ్రీకాంత్ తదితర సీనియర్ నటులుండటంతో అది ఇంకాస్త ఎక్కువైంది. బాలకృష్ణ గారు సైన్స్‌ను నమ్మే వ్యక్తి. అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటారు. ఆయనతో మరో సినిమా చేస్తున్నా.
ప్రచారంలో మార్పు..
సినిమా ప్రచారంలో మార్పులొచ్చాయి. ఒకప్పుడు అన్ని పాటలూ ఒకేసారి విడుదలైతే ఈ రోజుల్లో ఒక్కో పాట ఒక్కోసారి విడుదలవుతుంది. ఆడియో కంపెనీలూ ఈ ట్రెండ్‌కే మొగ్గుచూపుతున్నాయి. లిరికల్ వీడియోల ద్వారా గాయకులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈ విషయంలో దర్శకులు, హీరోలకు థ్యాంక్స్ చెప్పాలి. నం.1 పొజిషన్ అనే దాన్ని నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతానంతే’’ అని తమన్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్‌కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!