Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్‌ సాహిత్యం.. డీఎస్పీ, తమన్‌ సంగీతం! సందడే సందడి

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. దీపావళి సందర్భంగా సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ), తమన్‌ ఈ షోకి అతిథులుగా విచ్చేసి సందడి చేశారు.

Updated : 14 Sep 2023 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. అప్పుడప్పుడు ఈ షోకి సినీ తారల్ని ఆహ్వానించి ప్రేక్షకులకి మరింత వినోదం పెంచుతుంటారాయన. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్‌ (డీఎస్పీ), తమన్‌ ఈ షోకి అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్‌కి ఓ ట్యూన్‌ వినిపించి వావ్‌ అనిపించుకున్నారు. హాట్‌సీట్‌లో కూర్చున్న ఎన్టీఆర్‌కి, సంగీత దర్శకులకి మధ్య సంభాషణ ఇలా సాగింది. సంగీత వాయిద్యాల్లో ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత కార్యక్రమానికి ట్యూన్‌ కంపోజ్‌ చేయమని కోరారు. ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు’కి హుక్‌లైన్‌ వచ్చేసింది. మిగతా లిరిక్స్‌ మిమ్మల్నే అడుగుతాం’ అని డీఎస్పీ అనగానే ‘ఫస్ట్‌ మీరు మొదలుపెట్టండి.. లిరిక్స్‌ నేను యాడ్‌ చేస్తా’ అంటూ ఎన్టీఆర్‌ నవ్వులు పంచారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ డీఎస్పీ, తమన్‌ ఓ ట్యూన్‌ సిద్ధం చేసి వినిపించగా ఎన్టీఆర్‌కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. ‘అదిరిపోయింది ట్యూన్‌. ఇక్కడ కల మీది.. కథ మీది. ఆట నాది.. కోటి మీది. ఈ లిరిక్స్‌తో పాడండి’ అంటూ తానూ ఆలపించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మ్యూజికల్‌ హంగామాని మీరూ చూసేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని