Sonusood: ఐటీ దాడుల వల్ల వాళ్లు కోపంగా ఉన్నారు: సోనూసూద్‌

ఇటీవల జరిగిన ఐటీ దాడుల పట్ల తన అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని నటుడు సోనూసూద్‌ తెలిపారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజులపాటు...

Updated : 24 Sep 2021 07:12 IST

ముంబయి: ఇటీవల జరిగిన ఐటీ దాడుల పట్ల తన అభిమానులు ఆగ్రహంగా ఉన్నారని నటుడు సోనూసూద్‌ తెలిపారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నివాసం, కార్యాలయాల్లో మూడు రోజులపాటు జరిగిన ఐటీ దాడులపై సోనూ స్పందించారు. ‘‘మనం ఏదైనా మంచి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది’ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట వింటున్నాను. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నవాడిలో నేనే మొదటివాడినని అనుకోవడం లేదు. ఐటీ అధికారులు మా ఇంటికి రాగానే.. సమాచారాన్ని అడిగి తెలుసుకుని దాడులు సక్రమంగా జరిగేందుకు వాళ్లకు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పాను. ఐటీ దాడులు జరగడానికి ముఖ్యమైన కారణమేమిటనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. కొంతమంది దీనిని రాజకీయ కోణంలో చూస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని కలవడం వల్లే ఈ దాడులు జరిగాయంటూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. అయితే, అది రాజకీరపరమైన మీటింగ్‌ కాదని కేజ్రీవాల్‌తో భేటీ ముగిసినప్పుడే చెప్పాను. చిన్నారులందరూ చదువుకొనేలా చూడటమే నా ప్రధాన లక్ష్యమని చెప్పాను కూడా. ఇక, ఈ దాడుల నా అభిమానులు కొంతమేర ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నన్ను తమ కుటుంబసభ్యుడిలా భావించారు’ అని సోనూసూద్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని