Published : 05 Dec 2021 17:59 IST

Bangarraju: ‘బంగార్రాజు’ ప్రేమగీతం.. నాగచైతన్య, కృతిశెట్టి జోడీ అదుర్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. ఈ సినిమాలోని ‘నా కోసం’ అనే గీతాన్ని (లిరికల్‌ వీడియో) చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. బాలాజీ సాహిత్యం అందించిన ఈ ప్రేమగీతానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. చైతన్య, కృతిశెట్టిపై చిత్రీకరించిన పాట ఇది. ఈ జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని