Puneeth Rajkumar: నాటు నాటు సాంగ్‌కు పునీత్‌ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్‌

‘నాటు నాటు’ (Naatu Naatu Song).. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న పాట. టాలీవుడ్‌లో డ్యాన్సింగ్‌ స్టార్స్‌గా చెప్పుకొనే రామ్‌చరణ్‌-తారక్‌ మాస్‌ స్టెప్పులతో....

Updated : 24 Nov 2021 12:10 IST

హైదరాబాద్‌: ‘నాటు నాటు’ (Naatu Naatu Song).. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న పాట. టాలీవుడ్‌లో డ్యాన్సింగ్‌ స్టార్స్‌గా చెప్పుకొనే రామ్‌చరణ్‌-తారక్‌ మాస్‌ స్టెప్పులతో ఈ పాట సోషల్‌మీడియాని ఓ ఊపు ఊపుతోంది. ఇప్పుడు, ఇదే పాటకు కన్నడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఇటీవల ఓ నెటిజన్‌ వీడియో క్రియేట్‌ చేశాడు. పునీత్‌ నటించిన సినిమాల్లోని స్టెప్పులన్నింటినీ కలిపి.. ‘నాటు నాటు’ సాంగ్‌ వీడియో సృష్టించాడు. ‘#Puneeth lives On’’ అని పేర్కొంటూ నెట్టింట్లో ఆ వీడియోని షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘పునీత్‌ డ్యాన్స్‌ అదుర్స్‌’’ అంటూ సినీ ప్రియులు కామెంట్‌ చేస్తున్నారు. మరోవైపు.. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ పలువురు అభిమానులు మధుర జ్ఞాపకాలను వీడియోలుగా షేర్‌ చేస్తున్నారు.

రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తారక్‌ (NTR) కొమురం భీమ్‌గా.. చరణ్‌ (RamCharan) అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈక్రమంలోనే ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మూడో పాట విడుదలకు సిద్ధమైంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు