
Lakshya: ‘అలాంటోడితో పందెం ప్రమాదకరం’.. ఆకట్టుకునేలా నాగశౌర్య ‘లక్ష్య’ ట్రైలర్
ఇంటర్నెట్ డెస్క్: యువ నటుడు నాగశౌర్య హీరోగా ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆర్చరీకి సంబంధించిన సన్నివేశాలు, నాయకానాయికల లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నాగశౌర్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించారు. ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అని కథానాయకుడి పాత్రను తెలియజేసేలా జగపతిబాబు చెప్పిన డైలాగ్ మెప్పిస్తోంది. ‘నేను వందమందికి నచ్చక్కర్లేదు సర్. కానీ నన్ను ఇష్టపడే ఈ ఒక్క వ్యక్తీ నన్ను వద్దనుకుంటే నేను గెలిచేది దేనికి సర్’ అని నాగశౌర్య చెప్పిన సంభాషణ హృదయాల్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.