Bangarraju: ‘బంగార్రాజు’లో చైతూ.. టీజర్‌ వచ్చేసింది

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బంగార్రాజు’.

Updated : 23 Nov 2021 10:43 IST

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. మంగళవారం చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.  ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే సినిమాను సిద్ధం చేసినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని  శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పండగ బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో ఈ సినిమాకి చోటుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ్‌ సరసన  రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకి జోడీగా నాగలక్ష్మి అనే పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తుండగా.. యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని