Published : 27 Dec 2021 21:42 IST

Lakshya: ఓటీటీలోకి నాగశౌర్య ‘లక్ష్య’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘లక్ష్య’. థియేటర్లలో ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ ‘ఆహా’లో 2022 జనవరి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ కథకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. నాగశౌర్య సరసన కేతికశర్మ మెరిసింది. జగపతిబాబు, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ కథ..

పుట్టుకతోనే విలువిద్యను ఒంట‌బ‌ట్టించుకున్న కుర్రాడు పార్థు (నాగ‌శౌర్య‌). ఆ ప్రతిభ‌ త‌న తండ్రి వాసు (ర‌విప్రకాష్‌) నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చింది. అత‌నూ విలువిద్యలో ఆరితేరిన క్రీడాకారుడే. ఆర్చరీలో వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ కావాల‌న్నది త‌న క‌ల‌. కానీ, అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో క‌న్నుమూస్తాడు. దీంతో త‌న కొడుకు క‌ల‌ను మ‌న‌వ‌డి ద్వారా తీర్చుకోవాల‌ని తాపత్రయ‌ప‌డ‌తాడు వాసు తండ్రి (స‌చిన్ ఖేడ్కర్‌). పార్థు కూడా త‌న తండ్రీ, తాత‌ల క‌ల‌ను నెర‌వేర్చడ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు. త‌న ల‌క్ష్య సాధ‌న కోసం ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు కురుక్షేత్ర ఆర్చరీ అకాడ‌మీలో చేర‌తాడు. అదే అకాడ‌మీలో రాహుల్ (శ‌త్రు) కూడా విలువిద్యలో శిక్షణ తీసుకుంటుంటాడు. వ‌రుస‌గా రెండు సార్లు ఆర్చరీలో స్టేట్ ఛాంపియ‌న్‌గా నిలిచిన అత‌నికీ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌గా నిల‌వాల‌నే కోరిక ఉంటుంది. ఆర్చరీలో త‌న‌ని కొట్టేవాడే లేడ‌ని విర్రవీగే అత‌నికి పార్థు రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంది. స్టేట్ ఆర్చరీ ఛాంపియ‌న్ షిప్‌లో అత‌ని చేతిలో ఓసారి ఓట‌మి పాల‌వుతాడు. దీంతో ఆ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయిన రాహుల్‌.. ఎలాగైనా పార్థు ల‌క్ష్యాన్ని దెబ్బతీయ‌డానికి ప్రణాళిక ర‌చిస్తాడు. అదే స‌మ‌యంలో తన తాత చ‌నిపోవ‌డంతో పార్థు మాన‌సికంగా బాగా కుంగిపోతాడు. ఆట‌లో ల‌య త‌ప్పుతాడు. ఇదే అవ‌కాశంగా భావించిన రాహుల్ అత‌న్ని డ్రగ్స్‌కు అల‌వాటు ప‌డేలా చేస్తాడు. ఆ త‌ర్వాత జ‌రిగే ఓ సంఘ‌ర్షణ‌లో పార్థు చేతికి తీవ్ర గాయ‌మ‌వుతుంది. దీంతో ఆర్చరీకే దూర‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? పార్థు త‌న ల‌క్ష్య సాధ‌న కోసం తిరిగి విల్లు చేత బ‌ట్టాడా? ఆర్చరీ ప్రపంచ ఛాంపియ‌న్ షిప్‌ను గెలుచుకున్నాడా? ఈ ల‌క్ష్య సాధ‌న‌లో పార్థసార‌థి (జ‌గ‌ప‌తిబాబు).. పార్థుకు ఎలా సాయ‌ప‌డ్డాడు? రితిక (కేతిక శ‌ర్మ‌)తో పార్థు ప్రేమాయ‌ణం ఎలా సాగింది? అన్నది మిగతా కథ.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని