Lakshya: డిసెంబరు 10 లక్ష్యంగా

విలువిద్యలో ఆరితేరిన  అతగాడి లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా సాధించాడో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే అంటున్నాడు నాగశౌర్య. ఆయన కథా   నాయకుడిగా నటిస్తున్న

Updated : 25 Nov 2021 08:52 IST

విలువిద్యలో ఆరితేరిన  అతగాడి లక్ష్యం ఏంటి? దాన్ని ఎలా సాధించాడో తెలియాలంటే ‘లక్ష్య’ చూడాల్సిందే అంటున్నాడు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటిస్తూ ప్రత్యేక  పోస్టర్‌ను విడుదల చేసింది. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో  కనిపించనున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా  నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం : కాలభైరవ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని