Dhee 13: ‘ఆచార్య’ పాట ‘ఢీ’లో.. మీరు చూశారా?

‘ఆచార్య’ అనగానే అందరికీ గుర్తొచ్చే పాట ‘లాహే లాహే’. అంతగా శ్రోతల మదిలో గూడుకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మణిశర్మ సంగీతం, హారికా నారాయణ్‌, సాహితి గానం అత్యద్భుతంగా నిలిచాయి.

Published : 05 Aug 2021 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆచార్య’ అనగానే అందరికీ గుర్తొచ్చే పాట ‘లాహే లాహే’. అంతగా శ్రోతల మదిలో గూడుకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మణిశర్మ సంగీతం, హారికా నారాయణ్‌, సాహితి గానం అత్యద్భుతంగా నిలవడమే ఇందుకు కారణం. లిరికల్‌ వీడియోలో చూపించిన చిరంజీవి, కాజల్‌, సంగీత స్టెప్పులు అదరహో అనిపించాయి. దాంతో వెండితెరపై ఈ పాటని ఎప్పుడెప్పుడా చూస్తామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి ఇంకాస్త సమయం ఉండటంతో ఆ సందడిని బుల్లితెరపైకి తీసుకొచ్చింది ‘ఢీ’ కార్యక్రమం.

ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’గా ‘ఈటీవీ’లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్‌లో నైనిక అనే కంటెస్టెంట్‌ ‘ఆచార్య’లోని ‘లాహే లాహే’ పాటకి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించింది. తన హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సుమారు 20 మందికిపైగా బృంద సభ్యులతో కలిసి చేసిన ఈ నృత్యం కన్నుల పండుగగా సాగింది. డ్యాన్సు మాత్రమే కాదు పాటకు తగ్గట్టు తీర్చిదిద్దిన దేవాలయం సెట్‌, వాళ్ల వేషధారణ అన్నీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా వెండితెరపై ‘లాహే’ ఎలా ఉండబోతుందో ఓ ఉదాహరణగా బుల్లితెరపై ఆవిష్కరించారు. అందుకే వీళ్ల పర్ఫామెన్స్‌కి న్యాయ నిర్ణేతలతోపాటు టీం లీడర్లూ ఫిదా అయ్యారు. చూసిన ప్రేక్షకులూ వావ్‌ అన్నారు. యూట్యూబ్‌లో ఈ వీడియో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని, నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి..



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని