Nallamala: ‘నల్లమల’లో అంతర్యుద్ధం.. గెలుపెవరిదో..?

నల్లమల టీజర్‌ ఎలా ఉందంటే

Published : 30 Sep 2021 13:30 IST

హైదరాబాద్‌: ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’ వంటి చిత్రాల్లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ పోషించి సహాయనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు అమిత్‌ తివారి. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘నల్లమల’. భానుశ్రీ కథానాయిక. రవిచరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘నల్లమల’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘1980లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం మొదలయ్యే ముందు రోజు అది. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకునేలా సాగింది. ప్రతి సన్నివేశంలో అమిత్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. అధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాళకేయ ప్రభాకర్‌.. తదితరులు కీలకపాత్రలు పోషించారు. మరోవైపు, ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ‘ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే’ పాట విశేష ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని