Nani: నేచురల్‌ స్టార్‌ ట్యాగ్‌ తీసేయాలనుకుంటున్నా: నాని

నటనలోని సహజత్వంతో నేచురల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది....

Updated : 23 Dec 2021 15:05 IST

ఈ సారి భయం నా ముఖంలో కనిపిస్తుంది: సాయిపల్లవి

‘‘శ్యామ్‌ సింగరాయ్’’ ప్రెస్‌మీట్‌

హైదరాబాద్‌: నటనలో సహజత్వంతో నేచురల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ స్పెషల్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంది.

‘‘ఇప్పటితో మా ప్రయాణం ముగిసింది. ఇకపై మా చిత్రాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం. మరి కొన్నిగంటల్లో మా సినిమా మీ ముందుకు వస్తోంది. సినిమా బాగా చేశామనే నమ్మకం మాకు ఉంది. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడాల్సిన సినిమా ఇది. ఇదొక విజువల్‌ వండర్‌. సినిమా చూసి ఇందులో మీకు నచ్చిన, నచ్చని విషయాలు మాతో పంచుకోవాలి’’ - దర్శకుడు రాహుల్‌

ఇది పాన్‌ ఇండియా సినిమానా?

నాని: కాదు. కేవలం దక్షిణాది భాషల్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. 

మీరు ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తారు కదా. మరి, ఈసినిమా ఒప్పుకోవడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేమిటి?

నాని: ఈ కథలో ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. రెండున్నర గంటలపాటు ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. సినిమా చూసి బయటకు వచ్చాక ఓ విభిన్నమైన అనుభూతితో ఇంటికి వెళ్తారు.

ఈ సినిమా ఏ జోనర్‌ ప్రేక్షకుల్ని ఎక్కువగా అలరిస్తుంది?

నాని: అన్ని రకాల వయసు వారిని.. అన్ని జోనర్‌ ప్రేక్షకుల్ని ఈ కథ హత్తుకుంటుంది.

పాన్‌ ఇండియాలోకి ఎందుకు అడుగుపెట్టలేదు

నాని: ఇంట గెలిచి రచ్చ గెలుద్దామని. 

ఈ సినిమా వసూళ్లపై మీ అభిప్రాయం?

నాని: మంచి సినిమా చేశాం. ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఎంత వరకూ ప్రేక్షకులకు చేరుతుంది? ఎంత వసూళ్లు రాబడుతుంది? అనేది ప్రేక్షకులకే వదిలేశాం. 

ఈ సినిమాపై మీరు అంత నమ్మకంగా ఉండటానికి కారణం?

నాని: కథ. ఇది నా సినిమా అని చెప్పడం లేదు. సినిమాలోని కథ ప్రతిఒక్కరికీ నచ్చుతుంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటాయి. ఎందుకంటే మనం మనుషులం కదా. 

ఏపీలో సినిమా టికెట్‌ రేట్లపై మీ అభిప్రాయం?

నాని: ఏదైతే జరిగిందో అది సరైన పద్ధతి కాదు. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు అనేది పక్కనపెడితే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని అవమానించేలా ఉంది. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది.

ఈ సినిమాలో మీరు రెండు పాత్రలు చేశారు కదా. ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశారు?

నాని: రెండు పాత్రలు ఫుల్‌ ఎంజాయ్‌ చేశా. వాసు నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. శ్యామ్‌ చాలా విభిన్నంగా ఉంటుంది.

మీరు కథలు ఎలా ఎంచుకుంటారు?

నాని: నేను ప్రతి కథను ఒక ప్రేక్షకుడిగానే వింటాను. అది నన్ను ఎంతలా ఉత్కంఠకు గురి చేస్తుందా? అనేది పరిగణలోకి తీసుకుంటా. నాకు నచ్చితే తప్పకుండా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నాభావన.

ఈ సినిమాలో చూపించిన చాలా అంశాలు ఇప్పుడు సమాజంలో లేవు కదా? ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారా?

నాని: కథలో ఉన్న ఎమోషన్‌కి ప్రతి ఒక్కరూ తప్పకుండా కనెక్ట్‌ అవుతారు. 

సినిమాల విషయంలో ఎప్పుడైనా ఒత్తిడికి లోనయ్యారా?

సాయిపల్లవి: ప్రతి చిత్రాన్ని నేను ఎంజాయ్‌ చేస్తాను. నా రోల్‌కి పూర్తి న్యాయం చేయాలని అనుకుంటానంతే తప్ప ఒత్తిడికి లోనవ్వను. 

ఇది ఫిక్షనల్‌ పాత్రా?

రాహుల్‌: కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో తెలుగు సినిమాలు వచ్చాయి. కోల్‌కత్తా, అక్కడి ప్రజల్ని ఎలా చూపించాలి అనే విషయంలో నాకొక విజన్‌ ఉంది. లక్కీగా బెంగాలీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ వచ్చింది. గొప్ప ఆర్టిస్ట్‌లు దొరికారు. ఇది ఫిక్షనల్‌ కథనే.

ఈ సినిమా కోసం బెంగాలీనేర్చుకున్నారా?

నాని: బెంగాలీ నేర్చుకున్నాను. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో బెంగాలీవాళ్లను పెట్టాం. వాళ్ల మాటల్ని రికార్డ్‌ చేసుకొని దాన్ని వింటూ  చెప్పాను.

నేచురల్‌ స్టార్‌ ట్యాగ్‌..?

నాని: నేచురల్‌ స్టార్‌ కూడా తీసేయాలనుకుంటున్నా.

మీరు సినిమాలో ఉన్నారని.. మీకు ఎక్కువగా డ్యాన్స్‌లు ఉండేలా చేశారా?

సాయిపల్లవి: సినిమాకి ఎంత కావాలో అంత చూపించారు. అంతేకానీ నేను ఉన్నానని ప్రత్యేకంగా డ్యాన్స్‌ పెట్టలేదు.

సినిమా అనుకున్నప్పుడే నానిని దృష్టిలో పెట్టుకున్నారా?

రాహుల్‌: కథ, పాత్రలు డెవలప్‌ చేసేటప్పుడు నేను ఎవర్ని దృష్టిలో పెట్టుకోలేదు. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. నాని అయితే దీనికి సరిపోతారని నా ఉద్దేశం. నేను రాసిన కథను ఆయన నటనతో మూడింతలు పెంచారు.

ఈ సినిమా విషయంలో మీరు టెన్షన్‌ పడుతున్నట్లు ఉన్నారు?

సాయిపల్లవి: ప్రతి సినిమా విషయంలో నేను టెన్షన్‌ పడతాను. కానీ ఈ సినిమాకి అది నా ముఖంలోనే కనిపిస్తుంది.

నానితో కలసి చేయడం ఎలా ఉంది?

సాయిపల్లవి: మేమిద్దరం మంచి స్నేహితులం. కాబట్టి సినిమా షూట్‌ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. 

మీ గత రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడం పట్ల సంతృప్తిగా ఉన్నారా?

నాని: సంతృప్తిగానే ఉన్నాను. ఏ సినిమాలు లేని సమయంలో ప్రేక్షకుల్ని నేను ఓటీటీ వేదికగా అలరించినందుకు ఆనందిస్తున్నా. 

ఏపీలోని కొన్ని జిల్లాల్లో థియేటర్లు మూతపడ్డాయి కదా? 

వెంకట్‌: ఆ విషయంలో మేము భయపడటం లేదు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మంచి ఫలితమే ఉంటుందని భావిస్తున్నాం.

నానికి రాయల్‌స్టార్‌ ట్యాగ్‌ పెట్టాలనుకోవడానికి కారణం?

రాహుల్‌: నానిని అందరూ నేచురల్‌ స్టార్‌ అంటారు. శ్యామ్‌ సింగరాయ్‌లో ఆయన నటన చూశాక.. రాయల్‌స్టార్‌ అనే ట్యాగ్‌ పెడితే బాగుంటుందని అనుకున్నా. అదే విషయాన్ని నానితో చెప్పాను. దానికి ఆయన నాకు ఎలాంటి ట్యాగ్‌ పెట్టొద్దు. నేచురల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ కూడా తీసేసి.. టైటిల్‌ కార్డ్స్‌లో కేవలం నాని అని మాత్రమే వేయండి అని చెప్పాడు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని