Published : 09 Nov 2021 01:22 IST

Unstoppable: పులిహోర కబుర్లు చెప్పొద్దు: నానితో బాలకృష్ణ అల్లరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ నాని నుంచి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ కార్యక్రమంతో బాలకృష్ణ వ్యాఖ్యాతగా మారిన సంగతి తెలిసిందే. ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకి తొలి అతిథిగా మోహన్‌బాబు విచ్చేసి సందడి చేశారు. రెండో ఎపిసోడ్‌కి అతిథిగా నాని వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ విశేషాలివీ..

‘ఈరోజు మన గెస్ట్‌ మీ నుంచి వచ్చాడు. సెల్ఫ్‌మేడ్‌కి సర్‌నేమ్‌’ అంటూ నానిని ఉద్దేశించి బాలకృష్ణ చెప్పిన మాటలతో ప్రారంభమైన ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మాటలకు తగ్గట్టే నాని ఇచ్చిన ఇంట్రీ ఆకట్టుకుంది. బాలకృష్ణ-నాని కాసేపు క్రికెట్‌ ఆడారు. ఈ క్రమంలో అభిమానులు ‘జై బాలయ్య’ అంటుంటే ‘మీరు ఆగండ్రా. టెన్షన్‌ పెట్టకండి’ అని బాలకృష్ణ తనదైన శైలిలో నవ్వులు పంచారు. ‘ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అనే డైలాగ్‌తో నాని, ‘అందరికీ పెట్టి నాకు పెట్టలేదంటే’ అనే సంభాషణతో బాలకృష్ణ అలరించారు. ‘ఒత్తిడి తగ్గించుకునేందుకు నువ్వు ఏం చేస్తావ్‌? ఎలా రిలాక్స్‌ అవుతావ్‌’ అని బాలకృష్ణ అడగ్గా ‘సినిమాలు చూస్తా’ సర్‌ నాని సమాధానమిచ్చారు. ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ బాలకృష్ణ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత.. తన సినిమా విడుదల విషయంలో ఎదుర్కొన్న సమస్యల్ని నాని వివరించారు. మరి నాని ఎలా రిలాక్స్ అవుతారు? బాలకృష్ణతో ఇంకా ఏయే ఆసక్తికర విషయాలు పంచుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ ఎపిసోడ్‌ నవంబరు 12 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని