Narappa: ‘నారప్ప’ షూటింగ్‌ లొకేషన్లని చూశారా!

వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో  చిత్రీకరణకి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు వెంకటేశ్‌.

Published : 03 Aug 2021 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘నారప్ప’. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణకి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు వెంకటేశ్‌. ఇందులో సినిమాని ప్రారంభించిన ముహూర్తపు షాట్‌, దేవాలయం, థియేటర్‌ తదితర లొకేషన్లు చూపించారు. ఒక్కో సన్నివేశాన్ని తెరకెక్కించేందుకు చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ‘‘నారప్ప’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించేందుకు సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని స్వీకరించి, షూటింగ్‌ సజావుగా సాగేందుకు చిత్ర బృందం బాగా శ్రమించింది. ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలిచే కొన్ని సన్నివేశాల లొకేషన్లని ఈ వీడియోలో చూడండి’ అని వెంకటేశ్‌ పేర్కొన్నారు. తమిళ సినిమా ‘అసురన్‌’కి రీమేక్‌గా ‘నారప్ప’ రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కళైపులి ఎస్‌. థాను సమర్ఫణలో సురేశ్‌ బాబు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని