Narappa: నరకరా థీమ్‌ వచ్చేసింది..

అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.....

Published : 23 Jul 2021 12:55 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘నారప్ప’ నుంచి ‘నరకరా’ థీమ్‌ సాంగ్‌ను చిత్రబృందం శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘రా నరకరా నరకరా ఎదురుతిరిగి కసిగా.. తలలు ఎగిరిపడగా’ అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో ఆకట్టుకునేలా ఉంది. మణిశర్మ స్వరాలు అందించగా.. రేవంత్‌, సాయి చరణ్‌, శ్రీ కృష్ణా ఈ పాటను అలపించారు. కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకున్న ‘అసురన్‌’ రీమేక్‌గా ‘నారప్ప’ రూపుదిద్దుకుంది. భూవివాదం వంటి సామాజిక, సాంఘిక అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో వెంకటేశ్‌.. వృద్ధుడు, యువకుడిగా.. రెండు వేరియేషన్స్‌తో మెప్పించారు. ప్రియమణి కథానాయిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని