
MAA Elections: విష్ణు ప్యానెల్‌లో వివాదాస్పద వ్యక్తులు లేరు: నరేశ్
ఇంటర్నెట్ డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి మంచు విష్ణు ప్రకటించిన ప్యానెల్ చాలా బాగుందని ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్యానెల్‌లో వివాదాస్పద వక్తులెవరూ లేరంటూ అభినందించారు. మహిళలకు అధిక ప్రాధాన్యమివ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్యానెల్ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీపడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.