Cinema news: దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే!

నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.ఎఫ్‌.డి.సి) ఉత్తమ చిత్రాల జాబితాలో రోజా, సైరా సహా పలు చిత్రాలకు అరుదైన గౌరవం దక్కింది

Published : 28 Aug 2021 02:08 IST

దిల్లీ: భారతీయ సినిమా చరిత్రలో దేశభక్తిని రగిల్చిన అద్భుత చిత్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.ఎఫ్‌.డి.సి) 75 ఉత్తమ భారతీయ చిత్రాల్ని ఎంపిక చేసింది. దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాలివి. సంబంధిత పోస్టర్‌ని కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి, ఎల్‌. మురుగన్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మీనాక్షి లేఖిలు విడుదల చేశారు. వీటిల్లో అత్యధికంగా బాలీవుడ్‌ చిత్రాలున్నాయి. ‘లగాన్‌’, ‘బోర్డర్‌’, ‘భగత్‌సింగ్‌’, ‘గాంధీ’ తదితర ఉత్తరాది సినిమాల సరసన దక్షిణాది చిత్రాలు ‘రోజా’, ‘సైరా’, ‘కాలాపానీ’, ‘హే రామ్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు ‘ఐకానిక్‌ వీక్‌’గా ఈ వేడుక సాగుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని