Updated : 14/11/2021 08:34 IST

NBK 107: బాలకృష్ణ చిత్రం ప్రారంభం

‘అఖండ’ చిత్రాన్ని పూర్తి చేసిన బాలకృష్ణ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందజేశారు. ‘ఎన్‌.బి.కె.107’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ జనవరి నుంచి ప్రారంభమవుతుంది. ‘‘మాస్‌   కథానాయకుడు, మాస్‌ నాడి తెలిసిన దర్శకుడు కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు దర్శకుడు. వాణిజ్య హంగులతో, ఉన్నతమైన సాంకేతిక విలువలతో సినిమా రూపొందనుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కూర్పు: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, పోరాటాలు: రామ్‌లక్ష్మణ్‌.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని