Hansika: ఉత్కంఠకు గురి చేసే.. శృతి

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది నటి హన్సిక. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య

Updated : 18 Oct 2021 06:52 IST

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది నటి హన్సిక. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 85శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి కొత్త లుక్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా హన్సిక కనిపిస్తుంద’’న్నారు. ‘‘ఇప్పటి వరకు హైదరాబాద్‌, వైజాగ్‌లలో చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన షూట్‌ను భాగ్యనగరంలోనే పూర్తి చేస్తామ’’న్నారు నిర్మాత.  మురళి శర్మ, జయప్రకాష్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: మార్క్‌ రాబిన్‌, ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని