
Cinema News: పెద్దల ప్రేమకు పిల్లలు దూరమైతే?
రామ్ గౌడ, ప్రియా పాల్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వి.జె.సాగర్ దర్శకుడు. సి.రవి సాగర్ నిర్మాత. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి క్లాప్ కొట్టగా.. నిర్మాత రవి సాగర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు గౌరవ దర్శకత్వం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాగర్ మాట్లాడుతూ.. ‘‘చిన్న పిల్లలు పెద్ద వాళ్ల ప్రేమకు ఎలా దూరమవుతున్నారు? పెద్దయ్యాక వాళ్లెలా తయారవుతారన్న కథాంశంతో ఈ సినిమా చేస్తున్నాం. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘బలమైన కథ ఇది. నేటి సమాజంలోని ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. పిల్లల ఎదుగుదల కోసం వాళ్లకు ఏమివ్వాలి? ఎలాంటి విద్యనందించాలి? అన్నది చర్చిస్తున్నాం’’ అంది నాయిక ప్రియ. నిర్మాత రవి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు అద్భుతమైన కథను మంచి స్క్రీన్‌ప్లేతో రాసుకున్నారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది. ప్రేక్షకులంతా ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు. దిల్ రమేష్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.