
Cinema News: ఉత్కంఠభరిత రేసింగ్
యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మడ్డీ’. ప్రగభల్ దర్శకుడు. ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని తెలుగులో నిర్మాత దిల్‌రాజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నవంబర్ 30న సాయంత్రం 4:30గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. కేజీ రతీష్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.