Aadi: ఆది.. ‘తీస్‌ మార్‌ ఖాన్‌’

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా కల్యాణ్‌ జి గోగణ తెర కెక్కిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.

Updated : 15 Aug 2022 16:58 IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా కల్యాణ్‌ జి గోగణ తెర కెక్కిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయిక. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆది, పాయల్‌ల జోడీ రొమాంటిక్‌ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో ఆది విద్యార్థిగా, రౌడీగా, పోలీస్‌గా మూడు కోణాల్లో కనిపిస్తారు. ఓ కీలకమైన పాత్రలో సునీల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ స్వరాలందిస్తుండగా.. బాల్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని