Cinema News: బంపర్‌ ఆఫర్‌

ఇంద్రసేన, సంతోష్‌రాజ్‌,  నవీనారెడ్డి, మెరిన్‌ ఫిలిప్‌, ప్రగ్యా నయన్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బద్మాష్‌గాళ్లకి బంపర్‌ ఆఫర్‌’. రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్ర అవినాష్‌, అలవలపాటి శేఖర్‌  నిర్మాతలు.

Updated : 09 Dec 2021 09:16 IST

ఇంద్రసేన, సంతోష్‌రాజ్‌,  నవీనారెడ్డి, మెరిన్‌ ఫిలిప్‌, ప్రగ్యా నయన్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బద్మాష్‌గాళ్లకి బంపర్‌ ఆఫర్‌’. రవి చావలి దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్ర అవినాష్‌, అలవలపాటి శేఖర్‌  నిర్మాతలు. రాఘవేంద్రరెడ్డి సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ‘ఎవడు చెప్పిండ్రా...’ అంటూ సాగే పాటని నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘సస్పెన్స్‌ కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రమిది. ప్రతీ పది నిమిషాలకి ఓ మలుపుతో చిత్రం ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఇందులో బంపర్‌ ఆఫర్‌ ఏమిటనేది తెరపైనే చూడాలి. త్వరలోనే విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కామెడీ, డ్రామా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సమర్పకులు రాఘవేంద్రరెడ్డి తెలిపారు. సత్యప్రకాశ్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, సంగీతం: బాంబే భోలే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని